Namaste NRI

రష్యా అధ్యక్షుడికి షాక్‌.. అరెస్టు వారెంట్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌పై ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన అరెస్ట్‌ వారెంట్‌పై ఆ దేశం ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తున్నది. యుద్ధ నేరాలకు సంబంధించిన ఆరోపణలపై గత నెల ఐసీసీ పుతిన్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ వారెంట్‌పై ఎలా ముందుకెళ్లాలని చర్చించడానికి రష్యాలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రష్యాలో ఎదురులేని నేత పుతిన్‌ను రష్యాలో అరెస్టు చేయలేరు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అరెస్టు చేసే అవకాశం ఉం దనే ఆందోళన ఉన్నట్టు పలువురు అధికారులు చెప్తున్నారు. ఇది పుతిన్‌ విదేశీ పర్యటనలపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు. రష్యా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంగా యునైటెడ్‌ రష్యా పార్టీ, రాజకీయ అస్థిరత్వంగా మారొచ్చ ని పేర్కొన్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events