Namaste NRI

చరిత్ర సృష్టించిన భారత సంతతి సిక్కు మహిళ

అమెరికాలో భారత సంతతి సిక్కు మహిళ  చరిత్ర సృష్టించింది. అక్కడి పోలీస్ శాఖలో అసిస్టెంట్ పోలీస్ చీఫ్‌గా  బాధ్యతలు అందుకున్న తొలి సిక్కు మహిళగా మన్మీత్ కౌర్  చరిత్రకెక్కారు. ఈ సందర్భంగా మన్మీత్ కౌర్ తండ్రి కుల్వంత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తాను ఇండియన్ నేవీలో పనిచేసినట్లు చెప్పిన ఆయన,  తన కూతురు సైతం చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలని నిర్ణయించుకుందని తెలిపారు. ముఖ్యంగా మన్మీత్‌కు కెరీర్ పట్ల ఉన్న ఇష్టమే ఇవాళ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పోలీస్ స్థాయికి చేరేలా చేసిందని చెప్పారు. చదువులో ఎంతో చురుగ్గా ఉండే మన్మీత్,  మొదటి నుంచి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ లో పనిచేసిన బంధువులతో ప్రభావితమైందన్నారు. ఆమె 2024లో స్వదేశానికి రానున్నారని చెప్పిన కుల్వంత్ సింగ్,  అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శిస్తారని చెప్పుకొచ్చారు. ఆమె స్వస్థలం పంజాబ్‌ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ జిల్లా భుల్లేచక్ గ్రామం. మన్మీత్ సాధించిన ఈ ఘనత పట్ల ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News