Skip to main content

Namaste NRI

టీడీపీ-జనసేన-బీజేపీ ఎన్నారైల ఆత్మీయ సమావేశం

అమెరికాలోని  శాన్‌ఫ్రాన్సిస్కో బేఏరియాలో స్థిరపడిన ఎన్నారైలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సేవ్ ఆంధ్రా అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలువురు ఎన్నారైలు ఆత్మీయంగా కలుసున్నారు. రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్‌లో ఎన్‌డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి తామంతా ఏ విధంగా సహాయపడాలి, తమవంతు సహాయ సహకారాలు ఏవిధంగా ఎన్‌డీఏ కూటమికి అందించాలి అనే అంశాల్ని చర్చించారు.

గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా ఎలా అధోగతిపాలు అయిపోయిందో చెబుతూ పలువురు ఎన్నారై లు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సొంత రాష్ట్రం దుస్థితి చూసి బాధేస్తుందని విచారం వ్యక్తం చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పడి నాటి నుంచి ఇలాంటి తిరోగమనాన్ని రాష్ట్రం ఎప్పుడూ చూడలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే నెలరోజులు చాలా కీలకమైనవని, కుదిరిన వాళ్ళు గ్రౌండ్‌లోకి దిగాలని, కుదరనివాళ్ళు ఇక్కడినుండే మద్దతుగా పలు కార్యక్రమాలు చేయాలని తీర్మానించారు. తమ వంతు ఆర్థిక సహాయాన్ని జనసేన-తెలుగుదేశం కూటమికి అందించాలని తీర్మానించుకున్నామని కూటమి సభ్యులు తెలియజేశారు.

ఈ సమావేశంలో తెలుగుదేశానికి చెందిన ఎన్నారై సభ్యులు జయరాం కోమటి, శ్రీనివాస్ దేవల్ల, వెంకట్ కోగంటి, సత్య పోలవరపు, హరి సన్నిధి, జనసేనకు చెందిన వేణు అనుగంటి, తులసీరాం రావూరి, రామ్ చుండూరి, శ్రీనివాస్ చిమట, రెడ్డయ్య ప్రత్తిపాటి, అనిల్ అరిగే, సునీల్ పసుపులేటి, దుర్గ పెద్దిరెడ్డి, శంకర్ అడాబా, చంద్ర పట్టివాడు, సత్య పుట్ట, నారాయణ మట్టిగంట, రమేష్ రాగినేని, కిషోర్ కుమార్, నిరంజన్, రమణ అనుగంటి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events