
అగ్ర కథానాయిక కీర్తి సురేష్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం రివాల్వర్ రీటా. జేకే చంద్రు దర్శకుడు. రాధికా శరత్‌కుమార్, సునీల్, అజయ్‌ఘోష్ ప్రధాన పాత్రధారులు. హైదబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ఇది పర్‌ఫెక్ట్ డార్క్ కామెడీ ఫిల్మ్. ఈ సినిమాలో నేను ఫీమేల్ లీడ్ క్యారెక్టర్‌లో కనిపిస్తా. నన్ను రీటా పాత్రలో దర్శకుడు అద్భుతంగా చూపించారు అని చెప్పింది. ఒక్కరోజులో జరిగే ఈ కథలోని మలుపులు ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేస్తాయని, కామెడీ, యాక్షన్ కలబోతగా సినిమా మెప్పిస్తుందని తెలిపింది. తన కెరీర్‌లో ఇలాంటి హ్యూమర్ ఉన్న పాత్రను ఇప్పటివరకు చేయలేదని, నటిగా ఇదొక కొత్త అనుభమని కీర్తి సురేష్ పేర్కొంది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: సీన్ రోల్డాన్, నిర్మాతలు: సుదన్ సుందరం, జగదీష్ పళనిసామి, రచన-దర్శకత్వం: జేకే చంద్రు.















