Namaste NRI

ఛార్లెట్‌ లో విజయవంతమైన రాము వెనిగళ్ళ అభినందన సభ

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైగా ఉన్న రాము వెనిగండ్ల తెలుగుదేశం, జనసేన, బిజెపి తరపున కూటమి అభ్యర్థిగా కృష్ణాజిల్లా గుడివాడ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. విజయం సాధించిన తరువాత మొదటిసారిగా ఆమెరికాలోని ఛార్లెట్‌ కు వచ్చిన రాము వెనిగళ్ళకు అంబరాన్ని అంటేలా స్వాగతం పలకడంతోపాటు ఆత్మీయ సత్కారాన్ని ఘనంగా నిర్వహించారు. ఛార్లెట్‌ లో ఉన్న ఎన్నారై తెలుగు దేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ అభినందన సభ, సత్కారం జరిగింది. 

b48446de 2383 447b ba53 05996875621c

నార్త్‌ కరోలినాలోని హంటర్స్‌ విల్లే, గ్రీన్‌ మేనర్‌ ఫామ్స్‌లో జరిగిన ఈ అభినందన వేడుకల్లో వర్కింగ్‌ డే అయిన ప్పటికీ దాదాపు నాలుగువందల మంది ఛార్లెట్ ఎన్నారైలు  పాల్గొన్నారు. చాలామంది కుటుంబంతో కలిసి రావడం నిర్వాహకులను సంతోషపరిచింది.  తెలుగుదేశ వ్యవస్థాపక అధ్యక్షులు , ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారికి, నందమూరి హరికృష్ణ  విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి , శ్రీ రాము వెనిగండ్ల వేదికను అలంకరించారు. ఈ కార్యక్రమంలో తానా తాజా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పాల్గొన్నారు.

27b236f0 e6b2 4039 8353 f92fa55fba20

ఈ సందర్భంగా రాము వెనిగళ్ళ మాట్లాడుతూ, ఎన్నారైల ఆత్మీయ సత్కారం మరచిపోలేనిదన్నారు. అమెరికా లోని తెలుగు కమ్యూనిటీకి సేవలందిస్తూ, మరోవైపు జన్మభూమి ప్రగతికి తోడ్పాటును అందిస్తున్న ఎన్నారైల సేవలు మరువలేనివంటూ, తన గెలుపులో కూడా ఎన్నారైలు కీలక పాత్ర పోషించి గెలిపించారని, వారికి ధన్య వాదాలను ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికోసం, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని, రాష్ట్రంలో పెట్టు బడులను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి విశేషంగా కృషి చేస్తున్నారని, ఈ విషయంలో ఎన్నారైలు కూడా ముందుకు వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాలకు అనుకూలమైన అవకాశాలు ఉన్నాయని, మానవవనరులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నందుకు ఎన్నారైలు పెట్టుబడులు పెట్టి రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.

8698e59d 6052 4c57 acc0 525b3fb03840

  ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలు మాట్లాడుతూ, గత ప్రభుత్వ దౌర్జన్యాలు, ఆక్రమణలు, అవినీతిని సహించలేక ప్రజలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును ఇచ్చారని చెప్పారు. ఎన్నికల సమయం లో తాము కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పిన విషయాలను వారు వివరించి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక రాష్ట్రం ప్రగతిపథంలో పయని స్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎన్నారైలంతా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని, రాష్ట్ర ప్రగతికి ముందుకు రావాలని కోరారు.

3084338a 1886 42f1 896b b5a06fd290de
50e409c6 592a 4e9f 922f 2a94141522d8 130

ఈ కార్యక్రమాన్ని ఛార్లెట్ ఎన్నారై టీడీపీ స్థానిక నాయకులు నితిన్ కిలారు, నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, రమేష్ ముకుళ్ళ, బాలాజి తాతినేని, కిరణ్ కొత్తపల్లి, సతీష్ నాగభైరవ, మాధురి యేలూరి మరియు ఇతర ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులు సమన్వయపరచారు.  ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడిపితోపాటు, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చివరన ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

3c43c946 0ca5 451f 87c7 24bae38d1e06
f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 137
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events