Namaste NRI

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు.. తానా ఘన స్వాగతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం  (తానా ) సభల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఘనస్వాగతం లభించింది. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే తానా సభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తానా డైరెక్టర్ వంశీ కోట ఆధ్వర్యంలోని తానా ప్రతినిధి బృందం, సుబ్రమణ్యం ఓసూరు, క్రాంతి ఆలపాటి, యాక్టింగ్ కాన్సూల్ జనరల్‌ డా. వరుణ్‌తోపాటూ మరి కొంతమంది ప్రముఖులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం, గోరంట్ల పున్నయ్య చౌదరి, సామినేని కోటేశ్వరరావు, గంటా పున్నారావు, రాము కోట, రవి రావి, సుబ్రహ్మణ్యం, ప్రసాద్ చుక్కపల్లి, యలమంచిలి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News