Namaste NRI

జూన్‌ 6న ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. ఎక్కడో తెలుసా?

ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఇతిహాసిక నేపథ్య చిత్రం ఆదిపురుష్‌. కృతి సనన్‌ సీత పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రాన్ని టీ సిరీస్‌, రెట్రో ఫైల్స్‌ పతాకాలపై భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రమ వివరాలను చిత్రబృందం వెల్లడించారు. జూన్‌ 6వ తేదీ తిరుపతిలో ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహిస్తామని ఈ ప్రకటనలో తెలిపారు.  ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ సినిమా మీద అంచనాలు పెంచింది. ట్రైలర్‌లో కనిపించిన భారీ సాంకేతిక విలువలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌కు వచ్చిన అనూహ్య స్పందన నేపథ్యంలో చిత్రబృందం మరింత ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ సినిమాను 2డీ, త్రీడీతో పాటు ఐమ్యాక్స్‌ వెర్షన్‌లోనూ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా జూన్‌ 16న విడుదలకు సిద్ధమవుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events