సుడిగాలి సుధీర్, అయేషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం సుధీర్స్ జోకర్. పీఎస్ పుప్పాల దర్శకత్వం. ఈ చిత్రాన్ని ఆనంద మీడియా సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటి అభిరామి నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇందులో ఆమె గాయత్రీదేవి పాత్రలో కనిపించనుంది. ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు.

అమ్మకు ఇచ్చిన మాట చిరకాలం మిగిలిపోతుంది అంటూ ఈ పోస్టర్‌పై రాసిన క్యాప్షన్ హార్ట్‌టచింగ్‌గా అనిపిస్తున్నది. సినిమాలో ఆమె పాత్ర ఎమోషనల్‌గా సాగుతుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాతలు: శ్రీనివాసులు పీవీ, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ, రచన-దర్శకత్వం: పీఎస్ సునీల్ పుప్పాల.





























