విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పునరుద్ఘాటించారు. పార్లమెంట్ సమావేశాల్లో స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. విపక్ష నేతలతో కలిసి పార్లమెంట్ సమావేశాల్లో తమ గళం వినిపిస్తామని ప్రకటించారు. ఆర్థిక శాఖా మంత్రి, ఉక్కు మంత్రులను మరోమారు కలుస్తామని, తమ వాదనను వారికి వినిపిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ఏమాత్రం సబబుకాదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఢిల్లీలో జరగబోయే ధర్నాకు తాము మద్దతిస్తామని విజయసాయి రెడ్డి ప్రకటించారు.