Skip to main content

Namaste NRI

మహిళా ఎంపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. పార్లమెంట్‌లోనే

ఆస్ట్రేలియాకు చెందిన మ‌హిళా సేనేట‌ర్ లిడియా థోర్ప్  సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పార్ల‌మెంట్ హౌజ్‌లోనే ఓ సీనియ‌ర్ సేనేట‌ర్‌ త‌న‌లో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆమె ఆరోపించారు. సుర‌క్షిత‌మైన ప‌ని ప్ర‌దేశం కావాల‌ని ఆమె త‌న ప్ర‌సంగంలో తెలిపారు. పార్ల‌మెంట్‌లో సేనేట‌ర్ థోర్ప్ మాట్లాడుతూ.. తానేమీ చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు కోర‌డం లేద‌ని, లేదా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం లేద‌ని, ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న ఉన్న వ్య‌క్తి కూడా ఎవ‌రూ లేర‌ని ఆమె క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

పార్ల‌మెంట్ హౌజ్‌లోనే లైంగిక‌ప‌ర‌మైన వ్యాఖ్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని, కొంద‌రు వ్య‌క్తులు త‌న‌ను అనుచితంగా ట‌చ్ చేసిన‌ట్లు ఆమె తెలిపారు. ఓ సేనేట‌ర్ త‌న‌ను పార్ల‌మెంట్ హౌజ్‌లోనే వెంబ‌డించార‌ని, సాక్ష్యులు, కెమెరాలు లేని చోట అత‌ను అస‌భ్య‌క‌ర రీతిలో త‌న‌ను తాకిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. లిబ‌రల్ పార్టీ సేనేట‌ర్ డేవిడ్ వాన్ త‌న‌ను వేధించిన‌ట్లు ఆమె ఆరోపించారు. కానీ వాన్ మాత్రం ఆ ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events