Namaste NRI

పూజా కార్యక్రమాలతో ఆది సాయి కుమార్ కొత్త సినిమా షురూ

నటుడు సాయికుమార్‌ తనయుడు ఆది సాయికుమార్‌ నటిస్తున్న నూతన చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఆది కెరీర్‌లోనే వైవిధ్యంగా నిలిచే రూపొందుతున్న చిత్రమిది. తెలుగులో ఇప్పటివరకు టచ్‌ చేయని ఓ వైవిధ్యభరితమైన కథలో ఈ సినిమా ఉంటుంది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం మా యూనిట్‌ అందరికి మంచి గుర్తింపునిస్తుందనే నమ్మకం వుంది అన్నారు. బ్రహ్మాజీ, సత్యం, రాజేష్‌, మైమ్‌గోపి, నర్రా శత్రు, బెనర్జీ రేడియో మిర్చి హేమంత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ : సాయి శ్రీరామ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: గిరిధర్‌ మామిడిపల్లి. ఆదిత్య మూవీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్‌పై కేవీ శ్రీధర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events