Namaste NRI

వయసు ఏడాది.. ఆదాయం రూ.75 వేలు

ఇన్‌ఫ్లయెన్సర్స్‌ అనగానే కామన్‌గా టీనేజర్స్‌ లేదా యంగ్‌ పర్సన్స్‌ అయ్యుంటారని ఫిక్స్‌ అయిపోతాం. అందులోనూ ట్రావెల్‌ ఇన్‌ఫ్లయెన్సర్‌ గా అంటే ఇంకాస్త ఎక్కువే ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం. కానీ అమెరికాలో మాత్రం ఏడాది వయసున్న చిన్నారి ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సోషల్‌ మీడియాలో ఫేమ్‌ సంపాదించాడు. ఏడాది వయస్సు చిన్నారి ఓ వింత కోలువతో నెలకు రూ.75 వేలు సంపాదిస్తున్నాడు.  పలు ప్రాంతాల్లో పర్యటించడమే ఆ చిన్నారి చేస్తున్న పని. అమెరికాకు చెందిన బేబీ బ్రిగ్స్‌ ఇప్పటికే 45 సార్లు విమాన ప్రయాణం చేశాడు. ఆ దేశంలోని 16 రాష్ట్రాలను చుట్టొచ్చాడు. అలస్కా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఉతాల్లోని పార్కులు,  బీచ్‌ల్లోనూ తిరిగాడు. అసలు దీనికి డబ్బులెలా ఇస్తారని ఆలోచిస్తున్నారా? చిన్నారితో వివిధ ప్రాంతాలు చుట్టి. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం బ్రిగ్స్‌ తల్లి జెస్‌ పని. దీనికి డబ్బులు కూడా చెల్లిస్తారు. ఇలా సగటున నెలకు రూ.75 వేలకు పైగానే ఆదాయం వస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రిగ్స్‌కు 30 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Social Share Spread Message

Latest News