Namaste NRI

అఖిల్‌ ఏజెంట్‌ టీజర్‌ రిలీజ్‌

అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఏజెంట్‌. సాక్షి వైద్య నాయిక. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ముమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ పాన్‌ ఇండియా సినిమా.. త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే  హైదరాబాద్‌లో చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా  అఖిల్‌ మాట్లాడుతూ అభిమానుల సమక్షంలో మా సినిమా టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ప్రేక్షకుల ఎనర్జీతో నాలో నిప్పంటుకుంది. థియేటర్లలోకి వస్తున్నాం అన్నారు.  దర్శకుడు సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ గ్యారెంటీ అన్నారు. నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ ఇది మా ఏజెంట్‌ చిన్న గన్‌ నుంచి వచ్చిన బుల్లెట్‌. సినిమా మెషిన్‌ గన్‌లా ఉంటుంది. సినిమా ఎప్పుడొస్తుందన్నది కాదు. ఎంత గట్టిగా కొడతామన్నదే మాకు ముఖ్యం అన్నారు.

ఇంత మంచి చిత్ర బృందంతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని సాక్షి వైద్య అన్నారు. సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నా అంది.  టీజర్‌తో అఖిల్‌ అండర్‌ కవర్‌ ఏజెంట్‌గా సిక్స్‌ ప్యాక్‌ లుక్‌తో స్టైలిష్‌గా కనిపించారు. అతనో క్రూరమైన దేశ భక్తుడు. అతన్ని పట్టుకోవడం అసాధ్యం. తన డెత్‌ నోట్‌ ఇప్పటికే రాసి పెట్టుకున్నాడు అంటూ మమ్ముట్టి చెప్పే డైలాగ్‌తో అఖిల్‌ పాత్రను పరిచయం చేసిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. ఆఖర్లో టైమ్‌ ఫర్‌ వైల్డ్‌ రైడ్‌ అంటూ మెషిన్‌ గన్నులతో అఖిల్‌ చేసిన యాక్షన్‌ హంగామా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ టీజర్‌ను తమిళంలో శివకార్తికేయన్‌, కన్నడలో కిచ్చా సుదీప్‌, మలయాళంలో మమ్ముట్టి విడుదల చేశారు. హిందీలోనూ టీజర్‌ విడుదలైంది.  ఈ కార్యక్రమంలో నాయిక సాక్షి వైద్య, సినిమాటోగ్రాఫర్‌ రసూల్‌ ఎల్లోర్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events