Skip to main content

Namaste NRI

సందడిగా అఖిల్‌ అక్కినేని నిశ్చితార్థం.. కాబోయే సతీమణి ఎవరంటే?

యువ హీరో అక్కినేని అఖిల్‌ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఆయన నిశ్చితార్థం జైనబ్‌ రవ్జీతో జరిగింది. ఈ విషయాన్ని అఖిల్‌ తండ్రి, అగ్ర నటుడు నాగార్జున తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థ వేడుకను నిర్వహించినట్లు తెలిసింది. పారిశ్రామికవేత్త జుల్ఫీ రవ్జీ కుమార్తె అయిన జైనబ్‌ రవ్జీకి చిత్రకారిణిగా మంచి పేరుంది. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ, నాగార్జున మధ్య కొన్నేళ్లుగా చక్కటి స్నేహసంబంధా లు ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగిపోవడంతో అభిమానులు హ్యాఫీగా ఫీలవు తున్నారు. అఖిల్‌, జైనబ్‌ రవ్జీ జంటకు పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలంద జేశారు. ఇదిలా వుండగా డిసెంబర్‌ 4న నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల వివాహం జరగబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

Social Share Spread Message

Latest News