Skip to main content

Namaste NRI

సురాపానం సక్సెస్‌ మీట్‌

సంపత్‌కుమార్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా సురాపానం. ప్రగ్యా నయన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం సక్సెక్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్మించారు. హీరో, దర్శకుడు సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ జూన్‌ 10న విడుదల అని ప్రకటించినపుడు చాలా పెద్ద సినిమాల మధ్య ఎలా విడుదలకు వెళ్తున్నారు అని అడిగారని, అయితే మాకు మా సినిమాపై ఉన్న నమ్మకమే ముందుకు నడిపించిందన్నారు. సినిమా కొత్తగా ఉందనÊవఆనరు. ఎంటర్‌టైనింగ్‌గా ఉందన్నారు. ఈ వారం నుంచి థియేటర్స్‌ పెరుగుతున్నాయని అన్నారు. ఆడియెన్స్‌ కోరునే కొత్తదనం ఈ సినిమా ద్వారా ఇవ్వటం ద్వారానే విజయం దక్కిందన్నారు. చిన్న  చిత్రాలకు భారీ సంఖ్యలో థియేటర్స్‌ దొరకవని, కానీ సినిమా బాగుంటే థియేటర్స్‌ క్రమంగా పెరుగుతాయన్నారు. ఈ చిత్రానికి కూడా ఇలాగే జరగటం ఆనందంగా ఉందన్నారు. హీరోయిన్‌ ప్రగ్యా నయన్‌ మాట్లాడుతూ  తెలుగు తెరకు కొత్త అమ్మాయిని అయినా టీమ్‌ అంతా సహకరించారు. సినిమా కోసం మేము పడిన కష్టమే ఈ విజయాన్ని అందించింది అనుకుంటున్నాను. మాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్‌ అని అన్నారు.  ఈ చిత్రాన్ని  అఖిల్‌ భవ్య క్రియేషన్స్‌ పతాకంపై మట్ల మధు యాదవ్‌ నిర్మించారు. ఫాంటసీ థ్రిల్లర్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైన ప్రేక్షకాదరణ పొందింది.  ఈ కార్యక్రమంలో ఎడిటర్‌ జేబీ, మీసాల లక్ష్మణ్‌, నటులు పోతురాజ్‌, విద్యాసాగర్‌, అంజిబాబు యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. 

Social Share Spread Message

Latest News