Namaste NRI

అల్లరి నరేష్ కొత్త చిత్రం ప్రారంభం

అల్లరి నరేష్‌ నటిస్తున్న కొత్త చిత్రం మొదలైంది. అల్లరి నరేష్‌, ఆనంది హీరో హీరోయిన్లుగా జీ స్టూడియోస్‌ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ.ఆర్‌. మోహన్‌ దర్శకుడు. ఈ కొత్త చిత్రం షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైంది. బాలాజీ గుత్త సహ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ను బాలు మున్నంగి కొట్టగా, అభిషేక్‌ అగర్వాల్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. తొలి సన్నివేశానికి అనిల్‌ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. అందరూ ఆదరించే ఓ సరికొత్త కథతో ఈ సినిమా రూపొందుతోంది. నరేశ్‌ నుంచి ఆయన అభిమానులు కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా ఉంటాయి. వీలైనంత త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది అని చిత్ర బృందం తెలియజేసింది.  వెన్నెల కిషోర్‌, చమ్మక్‌ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అబ్బూరి వరి మాటలను అందిస్తున్నారు. ఈ చిత్రానికి  శ్రీచరణ్‌ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రామ్‌ రెడ్డి, ఎడిటర్‌: ఛోటా కె.ప్రసాద్‌. డిజైనర్‌ : బ్రహ్మ కడలి, యాక్షన్‌: వెంకట్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events