Namaste NRI

అల్లు అర్జున్‌ పుష్ప-3 … షూటింగ్ ఎప్పుడంటే

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పుష్ప. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా  పుష్ప-2  (ది రూల్‌) తెరకెక్కుతున్నది. అల్లు అర్జున్‌ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని ఇటీవల విడుదల చేసిన హంట్‌ ఫర్‌ పుష్ప  వీడియో రికార్డులు సృష్టించింది. దాంతో సీక్వెల్‌పై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్‌ పుష్ప చిత్రాల సిరీస్‌ను ఓ ఫ్రాంఛైజీగా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని, పుష్ప-3 (ది రూల్‌ బిగిన్స్‌) పేరుతో మూడో భాగానికి కూడా స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ  సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించిన ఫహాద్‌ ఫాజిల్‌ సైతం పుష్ప-3 ఉండబోతుందనే సంకేతాలిచ్చారు. ఓ వైపు  పుష్ప-2  చిత్రీకరణలో ఉండగానే మూడో భాగం గురించి పరిశ్రమ వర్గాలతో పాటు సోషల్‌మీడియాలో ఆసక్తికరమై చర్చ నడుస్తుండటం విశేషం. అయితే  పుష్ప-3  సినిమా విషయంలో నిజానిజాలేమిటో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటు న్నారు. 

Social Share Spread Message

Latest News