తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మర్యాదపూర్వకంగా కలిసారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసిన అరవింద్ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు. చలన చిత్రరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ, సహకారాలందజేస్తుందన్నారు.