జమ్మూ కశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రను అధికారులు తిరిగి పున ప్రారంభించారు. భారీ వర్షాలకు వరదలు వచ్చిన విషయం తెలిసిందే. వరదలతో తాత్కాలికంగా యాత్రను రద్దు చేశారు. ఆ తర్వాత ఐటీబీపీ, ఆర్మీ, వైమానిక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. గుహవద్ద మట్టి, రాళ్లను భద్రతా సిబ్బంది తొలగించారు. ప్రస్తుతం కొంత పరిస్థితులు మెరుగుపడటంతో యాత్రను తిరిగి ప్రారంభించారు. టోకెన్లు జారీ చేసి భక్తులను దర్శనానికి పంపుతున్నారు. అమర్‌నాథ్‌కు గుహకు పంత్ తర్నీ వైపు నుంచి వెళ్లాలని, దర్శనం అనంతరం బల్తాల్ మార్గంలోనే వెనక్కి రావాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం 7 వేలకు పైగా యాత్రికులు చండీన్వాడీ మార్గాన్ని దాటరు. ఇప్పటి వరకు 1.13 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్ గుహలో మంచులింగాన్ని దర్శించుకున్నారు.














