Skip to main content

Namaste NRI

మన మామిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా

మామిడి కాయలను, పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు అనుమతి లభించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్‌డీఏ) ఈ మేరకు అనుమతి మంజూరు చేసినట్టు తెలిపింది. దీంతో మహారాష్ట్ర,  ఉత్తరప్రదేశ్‌ రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రైతులకూ మేలు జరుగుతుందని భావిస్తున్నారు. భారత్‌ నుంచి వచ్చే మామిడిని అమెరికా 2020 నుంచి నియంత్రిస్తోంది. యూఎస్‌డీఏ అధికారులు భారత్‌కు వచ్చే ఇర్రేడియం సదుపాయాలను తనిఖీ చేసే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. అయితే 2021లో వ్యవసాయ శాఖ, రైతుల సంక్షేమ సంఘం యూఎస్‌డీఏతో ఒప్పందం చేసుకున్నాయి. దీని కింద భారత్‌ నుంచి వచ్చే మామిడి, దానిమ్మ ఉత్పత్తులకు.. అమెరికా నుంచి భారత్‌కు వచ్చే చెర్నీ, అల్ఫల్ఫాకు ఉమ్మడి ఇర్రేడియేషన్‌ ప్రోటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుంది.

                ఉమ్మడి ఒప్పందం కింద మార్చి నుంచి ఆల్ఫాన్సో రకం మామిడి కాయలను అమెరికాకు ఎగుమతి చేసుకోవచ్చు అని వాణిజ్య శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం వద్దనున్న గణాంకాల ప్రకారం 2017`18లో భారత్‌ 800 టన్నుల మామిడిని అమెరికాకు ఎగుమతి చేసింది. 2018`10లో 951 మెట్రిక్‌ టన్నులు, 2019`20లో 1,095 టన్నుల చొప్పున ఎగుమతులు నమోదయ్యాయి. రానున్న సీజన్‌లో 2019`20 కంటే ఎక్కువ ఎగుమతులు సాధ్యమవుతాయని వాణిజ్య శాఖ తెలిపింది. తాజా నిర్ణయంతో ఈ సంవత్సరం ఎగుమతులు మరింత పుంజుకుంటాయని భావిస్తున్నారు. త్వరలోనే ఈ ఎగుమతులు ప్రారంభమవుతాయని అమెరికా వాణిజ్య, వ్యవసాయ మంత్రి శాఖలు ప్రకటించారు.

Social Share Spread Message

Latest News