అమెరికన్ కార్ల కంపెనీ ఫోర్డ్ భారత్‌లో తయారీ కార్యకలాపాలు మూసివేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. చెన్నైలోని మరైమలైనగర్, గుజరాత్‌లోని సవంద్‌లో ఫోర్డ్ ఫ్యాక్టరీలున్నాయి. వీటిని విక్రయించేందుకు లేదా కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కోసం వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతోందని ఆ వర్గాలంటున్నాయి. ఫోర్డ్ ఫ్యాక్టరీల్లో ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసేందుకు ఓలా కంపెనీ ఆసక్తిగా ఉన్నట్టు చెబుతున్నాయి. అయితే ఈ పరిమాణంపై మాట్లాడడానికి ఓలా ప్రతినిధి నిరాకరించారు. ఫోర్డ్ కంపెనీ ప్రతినిధి కూడా ఊహాగానాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని తేల్చి చెప్పారు.