Skip to main content

Namaste NRI

నాకు లభించిన వాటిలో.. ఇదో పెద్ద అవకాశం

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో లోక్‌సభ సభ్యత్వం రద్దును తాను ఊహించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్  శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత సంతతివారినుద్దేశించి మాట్లాడుతూ 2000 సంవత్సరంలో నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో, వేటిని ఎదుర్కోవలసి వస్తుందో అస్సలు ఊహించలేదు. ఇలా జరుగుతుందని(లోక్‌సభ సభ్యత్వం రద్దు) అసలు అనుకోలేదు. కానీ ఆ తర్వాత దీన్ని నాకు లభించిన గొప్ప అవకాశంగా భావించా. నాకు లభించిన వాటిలో ఇదో పెద్ద అవకాశం. రాజకీయాలంటే అలానే ఉండాయి అని రాహుల్ అన్నారు.  

భారత్ జోడో యాత్ర గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ కథ ఆరు నెలల క్రితం మొదలైంది. అప్పట్లో మేం ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిపక్షాలన్నీ చిక్కుల్లో ఉన్నాయి.అధికార పక్ష ఆర్థిక ఆధిపత్యం, సంస్థాగత పెత్తనం నడుస్తున్నాయి.మా దేశంలోనే మేము ప్రజాస్వామ్య పోరాటం చేయడానికి అవస్థలు పడుతున్నాం.ఆ సమయంలో బారత్ జోడో యాత్ర చేయాలనినిర్ణయించుకున్నాను అని చెప్పారు.స్వదేశంలో పరిస్థితులను చక్కదిద్దడానికి విదేశీ సాయం కోరుతున్నారా? అని ప్రశ్నించగా తాను ఎవరి సహకారాన్ని కోరడం లేదన్నారు.

మన పోరాటం మనదేనన్న స్పష్టత తనకు ఉందన్నారు. అయితే స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో భారత్‌నుంచి వచ్చిన విద్యార్థులతో సత్సంబంధాలు కొనసాగించాలని అనుకొంటున్నట్లు వెల్లడించారు. వారితో తాను ముచ్చటించడానికి ఇది మంచి సమయమని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ కూడా ప్రజలతో మాట్లాడాలని, కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్‌, చైనా సంబంధాలు అంత సులువు కాదని, కఠినంగా ఉండబోతున్నాయని ఆయన అన్నారు. అయితే భారత్‌ను వెనక్కి నెట్టడం చైనాకు సాధ్యం కాదని రాహుల్ స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events