Skip to main content

Namaste NRI

బ్రిటన్‌లో జాతి ద్వేషంతో …ఓ భారతీయ యువతిపై

బ్రిటన్‌లో జాతి ద్వేషంతో ఓ భారతీయ యువతిపై లైంగిక దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌లో 20 ఏళ్ల భారతీయ యువతి వీధిలో పడి ఉండటాన్ని కొందరు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, బాధితురాలిని ఓ శ్వేత జాతీయుడు (32) పార్క్‌ హాల్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి లాక్కెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దాడికి కారణం ఆమె విదేశీయురాలు కావడమేనని పోలీసులు విశ్వసిస్తున్నారు. నిందితుడిని వల్సల్‌, పెర్రీ బార్‌ల్రో ప్రాంతంలో అరెస్ట్‌ చేసినట్లు వెస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌ పోలీసులు తెలిపారు.

Social Share Spread Message

Latest News