Skip to main content

Namaste NRI

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ , కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ , కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి ని కలిశారు.

ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి సహాయం, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల అభివృద్ధి, రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తి, కొత్త రైల్వే ప్రాజెక్టుల మంజూరు, రైల్వే సేవల విస్తరణతో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వ మద్దతు మరియు దాని భవిష్యత్ అభివృద్ధి అంశాలపై ప్రధానం గా చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News