Skip to main content

Namaste NRI

అన్నే కార్స‌న్‌కు సాహిత్యంలో నోబెల్

కెన‌డా ర‌చ‌యిత్రి అన్నే కార్స‌న్‌ను నోబెల్ సాహిత్య అవార్డు(2026) వ‌రించింది. సాహిత్యంలో ఆమె కొత్త ప్ర‌క్రియ‌కు బీజం వేశారు. స‌మాకాలీన సాహిత్యంలో కొత్త ఒర‌వ‌డి సృష్టించారు. అన్నే కార్స‌న్ 1950లో టొరంటోలో జ‌న్మించారు. 1981లో ఓడీ ఎట్ ఆమో ఎర్గో స‌మ్ థీసిస్‌ను ఆమె డాక్ట‌రేట్ కోసం ప్ర‌జెంట్ చేశారు. 1990లో ఆమె ఓ సిరీస్‌ను ప‌బ్లిష్ చేశారు. ద గ్లాసీ ఎస్ఏ, గ్లాస్‌, ఐర‌నీ, గాడ్ అనే ర‌చ‌న‌లు చేశారు. దాంట్లో ఆమె సుదీర్ఘ క‌విత్వ ర‌చ‌న చేశారు.

1998లో ఆటోబ‌యోగ్ర‌ఫీ ఆఫ్ రెడ్‌ ఏ నావెల్ ఇన్ వ‌ర్స్ అనే న‌వ‌ల రాశారామె. లైట్ ట‌చ్‌తో ఆమె క‌థ‌లు రాస్తూ, ర‌చ‌నా శైలిలో కొత్త పోక‌డ‌లు వెతికారు. దీంతో ఆమె సాహిత్య ప్ర‌క్రియ‌పై ఆస‌క్తి పెరిగింది. హాస్యం, వ్యంగాన్ని కూడా త‌న ర‌చ‌న‌ల్లో చూపారామె. ద బ్యూటీ ఆఫ్ ద హ‌జ్‌బెండ్‌, ఏ ఫిక్ష‌న‌ల్ ఎస్సీ ఇన్ 29 టాంగోస్‌ను 2001లో ప‌బ్లిష్ చేశారు. త‌న భ‌ర్త గురించి ఆమె 29 ఎపిసోడ్‌లు రాశారు. జాక్ కీట్స్ సాహిత్య చ‌మ‌క్కుల‌ను వాడుతూ ఆమె ఆ క‌థ‌నాలు రాశారు. త‌న సోద‌రుడి జ్ఞాప‌కార్ధం నాక్స్ అనే ర‌చ‌న చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events