Skip to main content

Namaste NRI

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. తాజాగా కెనడాకు చెందిన ఇవాన్‌ హో కేంబ్రిడ్జ్‌ అండ్‌ లైట్‌ హౌస్‌ కాంటన్‌ హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో భారీ ల్యాబ్‌ స్పేస్‌ను తీసుకునేందుకు ముందుకొచ్చింది. జీనోమ్‌ వ్యాలీలో సుమారు 100 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.740 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ల్యాబ్‌ స్పేస్‌లో సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పెట్టుబడిని వినియోగించనున్నట్లు తెలిపింది. కంపెనీ భారత ప్రతినిధులు చాణక్య చక్రవర్తి, శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్‌ సిన్హాత్‌ కూడిన బృందం మంత్రి కేటీఆర్‌తో వర్చువల్‌గా సమావేశమై ఈ విషయాన్ని వెల్లడిరచింది.
లైఫ్‌ సైన్సెస్‌ రంగ మౌలిక వసతుల క్పనలో ఇవాన్‌ హో కేంబ్రిడ్జ్‌ భారీ పెట్టుబడి ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జీనోమ్‌ వ్యాలీలో ఇప్పటికే 200కు పైగా లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని వివరించారు. తాజా పెట్టుబడితో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ప్రభుత్వ విజన్‌కు మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీకి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కంపెనీకి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరపున అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. వర్చువల్‌ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, డైరెక్టర్‌ లైఫ్‌ సైన్సెస్‌ శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events