Namaste NRI

మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి

అమెరికా న్యాయ‌శాఖ‌కు చెందిన పౌర హ‌క్కుల విభాగానికి అసిస్టెంట్ అటార్నీ జ‌న‌ర‌ల్‌గా భార‌తీయ సంత‌తి వ్య‌క్తి హ‌ర్మీత్ కే థిల్లాన్‌ ను నియ‌మించారు డోనాల్డ్ ట్రంప్‌. కాబోయే అధ్య‌క్షుడిగా ఎన్నికైన ట్రంప్ త‌న‌కు చెంది న ట్రుత్ సోష‌ల్ మీడియాలో ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. త‌న కెరీర్ మొత్తం పౌర‌ల హ‌క్కుల కోసం హ‌ర్మీత్ పోరాడిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.  దేశంలోని టాప్ ఎన్నిక‌ల న్యాయ‌వాదిగా కూడా ఆమెకు గుర్తింపు ఉన్న‌ది. లీగ‌ల్ ఓట్ల‌ను మాత్ర‌మే లెక్కించాల‌ని ఆమె పోరాటం చేశారు. డార్ట్‌మౌత్ కాలేజీలో ఆమె గ్రాడ్యుయేష‌న్ చేశారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ వ‌ర్జీనియా లా స్కూల్ నుంచి ఆమె ప‌ట్టా పొందారు. యూఎస్ ఫోర్త్ స‌ర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో ఆమె క్ల‌ర్క్‌గా చేశారు.

సిక్కు మ‌త‌వ‌ర్గీయుల్లో హ‌ర్మీత్‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన గుర్తింపు ఉన్న‌ట్లు ట్రంప్ త‌న ట్వీట్‌లో తెలిపారు. రాజ్యాంగ‌ప‌ర‌మైన హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించేందుకు ఆమె అవిశ్రాంత పోరాటం చేయ‌నున్న‌ట్లు చెప్పారు.  దిల్లాన్ చండీఘ‌డ్‌లో జ‌న్మించారు. చిన్న‌త‌నంలోనే ఆమె పేరెంట్స్‌తో క‌లిసి అమెరికా వ‌ల‌స‌వెళ్లారు. క్లీవ్‌లాండ్‌లో జ‌రిగిన ఇండియ‌న్ అమెరిక‌న్ జీవోపీ క‌న్వెన్ష‌న్‌లో ఆమె తొలిసారి ప్ర‌సంగించారు. ఆ మీటింగ్ అర్దాస్ చ‌దివినందుకు ఆమెపై వ‌ర్ణ‌వివ‌క్ష దాడి జ‌రిగింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events