కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అధిష్ఠానం కొత్త బాధ్యతలు కట్టబెట్టనుంది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల కంటే ముందుగా మరో కీలక పదవి కట్టబెట్టడానికి అధిష్ఠానం రెడీ అయ్యింది. లోక్‌సభలో కాంగ్రెస్ నేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధీర్ రంజన్ చౌదరి స్థానంలో రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇందుకు రాహుల్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అధీర్ స్థానంలో మనీశ్ తివారీ, లుధియానా, థరూర్, గౌరవ్ గొగోయ్ వీరిలో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పజెప్పనున్నారని ప్రచారం జరిగింది. అయితే అన్యూహ్యంగా రాహుల్ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి.