Skip to main content

Namaste NRI

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ద‌క్కింది. ఈరోజు (మంగళవారం) జరిగిన మహిళల 400 మీటర్ల టీ20 రేసులో పారా అథ్లెట్ దీప్తి 55.82 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఈ రేసులో దీప్తి జీవన్‌జీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ప‌త‌కంతో పారాలింపిక్స్ లో భార‌త్ ప‌త‌కాల సంఖ్య (స్వ‌ర్ణ‌3, ర‌జ‌త‌5, కాంస్యం*8) 16కు చేరింది. కాగా ఈ పోటీలో 55.16 సెకన్లతో అగ్రస్థానంలో నిలిచిన యూలియా షుల్యార్ స్వర్ణ పతకాన్ని అందుకుంది. మరోవైపు టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ (55.23) రజతం సాధించింది.

Social Share Spread Message

Latest News