Namaste NRI

రానా, తేజ కాంబినేషన్‌లో మరో చిత్రం

హీరో రానా, దర్శకుడు తేజ కాంబినేషన్‌లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ సక్సెస్‌ఫుల్‌ జోడి కలయికలో రాబోతున్న సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. సీనియర్‌ నిర్మాత గోపినాథ్‌ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. గతంలో నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా పోషించిన జోగేంద్ర పాత్రకు మించిన విధంగా మరింత పవర్‌ఫుల్‌ పాత్రలో రానా ఈ చిత్రంలో కనిపిస్తాడని, పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందబోతుందని చిత్రబృందం తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events