Skip to main content

Namaste NRI

కమలా హ్యారిస్ మరో అరుదైన రికార్డు… 191 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్ తాజాగా మరో అరుదైన రికార్డును తన పేరున లిఖించుకున్నారు. భారత సంతతికి చెందిన కల్పనా కోటగల్‌ ను యూఎస్ సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్ సభ్యురాలిగా నియమించే విషయంలో కమలా టై-బ్రేకింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూఎస్ సెనేట్‌  లో ఓటింగ్ జరిగింది. కల్పనా కోటగల్‌ను నియమించాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. దాంతో ఉపాధ్యక్షురాలిగా కమలా టై-బ్రేకింగ్ ఓటు వేశారు. ఇక అమెరికా  చరిత్రలో ఉపాధ్యక్షుడు ఇలా టై-బ్రేకింగ్ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది 191 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

కాగా, 1825-1832 మధ్య కాలంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన జాన్ క్విన్సీ ఆడమ్స్, ఆండ్రూ జాక్సన్ ఇద్దరికీ సౌత్ కరోలినాకు చెందిన జాన్ సి. కాల్హౌన్  వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ సమయంలో దాదాపు ఎనిమిదేళ్లలో 31 టై-బ్రేకింగ్ ఓట్లను వేశారాయన. అలా కాల్హౌన్ తర్వాత మళ్లీ ఇప్పుడు (191 ఏళ్ల తర్వాత) కమలా హ్యారిస్ టై-బ్రేకింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Social Share Spread Message

Latest News