Namaste NRI

తాలిబాన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆఫ్ఘన్‌లో మహిళల ఉన్నత విద్యపై ఆంక్షలు విధించిన తాలిబన్లు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అఫ్ఘన్‌ మహిళలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేయడాన్ని తాలిబన్‌ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్‌, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు డ్రైవింగ్‌ టీచర్లకు ఆదేశాలు కూడా జారీ అయినట్టు తెలిసింది. ముఖ్యంగా తాలిబన్లు మహిళలపై ఉద్యోగాలు, పాఠశాలలతో పాటు ఇతర అంశాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. దేశంలో ఆహార కొరతతో పాటు నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మానవ హక్కులు కూడా పూర్తిగా హరించబడిన సమయంలో ఈ నిర్ణయం వెలువడిరది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events