Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు మరో షాక్‌

 ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేసిన అమెరికా, తాజాగా రష్యాకు సంబంధించిన నిఘా సమాచార మార్పిడిని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్‌ విమానాల కదలికలు, విధ్వంసక క్షిపణుల ప్రయాగాలు ఉక్రెయిన్‌కు ఇక తెలిసే అవకాశం ఉండదు.గత  వారం అమెరికా అధ్యక్షుడికి, ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి జరిగిన వాగ్యుద్ధం ఫలితంగా అమెరికా ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేయగా తాజాగా నిఘా సమాచార మార్పిడి నిలిపివేతతో ఉక్రెయిన్‌ భారీగా ప్రాణనష్టాన్ని చవిచూసే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.

 గతంలో ఉక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్న అమెరికా తన వైఖరిని మార్చుకుని రష్యాతో రాజీమార్గంలో యుద్ధ సమస్యను పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలు జెలెన్‌స్కీకి మింగుడుపడడం లేదు. అయితే సైనిక సాయం, నిఘా సమాచార మార్పిడిపై విధించిన నిషేధాలు తాత్కాలికమేనని, శాంతి చర్చలు పురోగతిని బట్టి వాటిని తొలగించడం జరుగుతుందని సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ వెల్లడించారు.

Social Share Spread Message

Latest News