Namaste NRI

భారత్ కు మరో ముప్పు

భారత్‌కు మరో ముప్పు పొంచి ఉంది. ఉష్టమండల ప్రాంతాల్లో కనిపించే పెను తుఫాన్లులో అత్యంత తీవ్రత కలిగే సూపర్‌ సైక్లోన్ల వల్ల రానున్న కాలంలో భారత్‌లో విధ్వంసకర పరిస్థితులు తలెత్తవచ్చని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణ మార్పులే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. 2020 లో విరుచుకుపడ్డ అంఫన్‌ సూపర్‌ సైక్లోస్‌ తీవ్రత పెరుగడానికి గ్లోబల్‌ వార్నింగ్‌ ఒక కారణమని పరిశోధకులు వెల్లడిరచడం తెలిసిందే.  గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాల మోతాడు ఇలాగే కొనసాగితే, అంఫన్‌ సృష్టించిన బీభత్సం కంటే 250 శాతం ఎక్కవ తీవ్రతతో భారత ప్రజలు ప్రభావితం కావొచ్చని హెచ్చరించారు.  ఒక మీటరు కంటే ఎక్కువ స్థాయిలో వరదలు విరుచుకుపడవచ్చని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events