Skip to main content

Namaste NRI

రాధేశ్యామ్ నుంచి మరో అప్ డేట్… పరమ హంస గా రెబల్ స్టార్

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సినిమా రాధేశ్యామ్‌ కోసం ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సాహో తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా ఇది. దాదాపు మూడేళ్లు కష్టపడితే రాధేశ్యామ్‌ షూటింగ్‌ పూర్తయింది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫష్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ అభిమానులను అలరిస్తున్నాయి. ఈ నెల 23న రామోజీ ఫిల్మ్‌సిటీలో ముందస్తు విడుదల వేడుకని నిర్వహించబోతున్నారు.  పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్‌, డాక్టరు ప్రేరణ పాత్రలో పూజ కనిపిస్తారు. పరమాహంస పాత్ర చేసిన కృష్ణంరాజు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కొంతకాలం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చినందుకు హ్యాపి. అది కూడా ప్రభాస్‌ హీరోగా చేసిన రాధేశ్యామ్‌ చిత్రంలో పరమహంస పాత్ర చేయడం మరింత ప్రత్యేకం అని పేర్కొన్నారు కృష్ణంరాజు. వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News