Skip to main content

Namaste NRI

అది ఉంటే ఎవరైనా సక్సెస్‌ అవుతారు : దిల్ రాజు

కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన తాజా చిత్రం క‌. సుజీత్‌, సందీప్‌ దర్శకులు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాత.  ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకోంది. అయితే ఈ సినిమా స‌క్సెస్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు మేక‌ర్స్. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన అగ్ర నిర్మాత  దిల్ రాజు మాట్లాడుతూ ఇటీవల ఓ హీరో తమ సినిమాను సెలబ్రిటీలెవరూ సపోర్ట్‌ చేయడంలేదని వాపోయాడు. ఇక్కడ ఎవరి బిజీ వాళ్లది. ఎవరొచ్చారు.. ఎవరు రాలేదు.. అనేది ముఖ్యం కాదు. ఇక్కడ టాలెంట్‌ ముఖ్యం. అది ఉంటే ఎవరైనా సక్సెస్‌ అవుతారు. కష్టపడ్డారు కాబట్టే క అంతటి సక్సెస్‌ అయ్యింది. కిరణ్‌ నువ్వుకూడా ఎప్పుడూ ఎమోషనల్‌ కావొద్దు. నువ్వు మాట్లాడకూడదు. నీ సక్సెస్‌ మాట్లాడాలి. పరిశ్రమలో ఎవరూ సపోర్ట్‌ చేయరు. అలాగే వెనక్కీ లాగరు. ఇక్కడ హార్డ్‌వర్కే మనల్ని నిలబెట్టేది  అని అన్నారు.

కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ క విడుదలకు ముందు నెగెటివ్‌గా మాట్లాడిన వాళ్లు 99శాతం ఉండేవారు. మంచి మూవీ అని చెప్పినా నమ్మలేదు. కానీ జనం మాత్రం సినిమాను బాగా నమ్మారు. అందుకే ఈ స్థాయి సక్సెస్‌ దక్కింది. ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు మా టీమ్‌ అంతా రుణపడి ఉంటుంది  అన్నారు. ఇంకా అతిథులుగా విచ్చేసిన బన్నీవాసు, దర్శకులు వశిష్ఠ, అనిల్‌ విశ్వనాథ్‌లతోపాటు చిత్ర దర్శకులు సుజీత్‌, సందీప్‌, నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి, పంపిణీదారుడు నందిపాటి వంశీ, నటి శరణ్య కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News