తెలంగాణ, ఏపీ మధ్య జరుగుతున్న జల జగడంపై నాగార్జున సాగర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కృష్ణా జలాల విషయంలో కేంద్రం తెలంగాణ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఏపీ సర్కార్ దాదాగిరీ చేస్తోందని నిప్పులు గక్కారు. కృష్ణా నదిపై ఏపీ సర్కార్ ఎలా అక్రమంగా ప్రాజెక్టులు కడుతుందో అందరూ చూస్తున్నారని, కృష్ణా నీళ్ల విషయంలో రాబోయే రోజుల్లో ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ఇబ్బందులు రాకుండా కృష్ణా జలాల వివాదంపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించాల్సింది పోయి, కేంద్రం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.