Namaste NRI

ఏపీ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్‌ తొలగించింది. ప్రతీ ఏటా ఇంటర్‌ మార్కులు ఆధారంగా ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజ్‌ ఇస్తున్న ఉన్నత విద్యామండలి.. కోవిడ్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షలు రద్దు నేపథ్యంలో ఈ ఏడాది వెయిటేజ్‌ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News