Namaste NRI

అన్నీ ఆలోచించే ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులకు అప్పజెప్పాం : కేంద్రం

కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణను ఆయా బోర్డులకు అప్పగించడంపై కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఈ గెజిట్ ఇచ్చే ముందు అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ గెజిట్‌ను విడుదల చేశామని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. అంతా ఆలోచించిన తర్వాతే గెజిట్‌లో ప్రతిపదం రాశామని, ఏపీ పునర్విభజన చట్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరుగుతుందని, నోటిఫికేషన్ ప్రకారం బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలూ సమానంగా భరించాల్సిందేనని తేల్చి చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లోగా 200 కోట్లను డిపాజిట్ చేయాలని, బోర్డుల నిర్వహణకు ఎలాంటి వనరుల కొరత రాకూడదన్నారు. నోటిఫికేషన్‌లోని షెడ్యూల్ 2 పూర్తిగా బోర్డుల పరిధిలోనే ఉంటుందని, బిపార్గ్‌ షెడ్యూల్ లో ఉన్నంత మాత్రాన ఆమోదం పొందినట్లు కాదని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల సూచన మేరకే నిర్ణయాలు తీసుకోవాలని, ఇరు రాష్ట్రాల అవసరాలు, ప్రతిపాదనల మేరకు నీటి విడుదల ఉంటుందన్నారు. నీటి వాటా పంపిణీ అనే అంశం చాలా సున్నితమని, ప్రతి విషయాన్నీ అన్ని కోణాల్లోనూ ఆలోచించాల్సి ఉంటుందన్నారు.

స్వాగతించిన ఆంధ్రప్రదేశ్

జల్‌శక్తి శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తాము ఆహ్వానిస్తున్ననామని ఏపీ జలవనరుల శాఖా అధికారులు ప్రకటించారు. బేసిన్ పరిధిలో లేని వాటినీ పేర్కొన్నారని, వాటిని సవరించాలని సూచించారు. ఈ నోటిఫికేషన్ ఏపీ హక్కులను కాపాడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఏపీలోని కొన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడం ఎంతో అవసరమని ఈఎన్‌సీ నారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే దిగువన ఉన్న ప్రాజెక్టులు, కాల్వలు బోర్డు పర్యవేక్షణలో ఉంటే పంటలు దెబ్బతినే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress