కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా విక్రమ్. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా. పోలీస్ అధికారి పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు మరో కొత్త ఆకర్షణ తోడైంది. తమిళ అగ్రహీరో సూర్య ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించబోతున్నారని టాక్. ఇటీవల విక్రమ్ షూటింగ్ లొకేషన్‌కి సూర్య వెళ్లినప్పుడు కమల్ ఆత్మీయంగా హత్తుకుని ఆహ్వాహించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. దాంతో సూర్య అతిథి పాత్ర చేశారని స్పష్టం అవుతోంది. కథాగమనాన్ని మలుపు తిప్పే ముఖ్యమైన పాత్రలో సూర్య కనిపిస్తారని ఆయన క్యారెక్టర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది.














