యాదాద్రి జిల్లాలోని గందమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలోనే పాదయాత్ర చేపడుతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. యాదాద్రికి పలుమార్లు వచ్చిన సీఎం కేసీఆర్ ఒక్కసారైనా యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీల పరిస్థితి చూశారా అని ప్రశ్నించారు. మూడు నియోజకవర్గాలకే ముఖ్యమంత్రిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. డిగ్రీలు చదివిన విద్యార్థులకు ఉపాధి హామీ పని కూడా ఉద్యోగమే అని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి మంత్రులు ఉన్న సీఎం కేసీఆర్‌కు పోయే కాలం దగ్గర పడిరదని ఆయన జోస్యం చెప్పారు. కేసీఆర్ మెడలు వంచైనా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయిస్తామని అన్నారు.