Skip to main content

Namaste NRI

వైజాగ్ లో అశోక్ గల్లా 2 కీలక షెడ్యూల్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు యంగ్ హీరో అశోక్ గల్లా ప్రస్తుతం తన రెండవ ప్రాజెక్ట్  అశోక్ గల్లా2  చేస్తున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తు న్నారు. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తు న్నారు.

ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా మూడో షెడ్యూల్ తాజాగా వైజాగ్ లో ప్రారంభమైంది. ఈ లెంతీ షెడ్యుల్ లో సాంగ్, ఫైట్, టాకీ పార్ట్ ని షూట్ చేస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్ లో టీం అంతా పాల్గొంటున్నారు. ఇటివలే అశోక్ గల్లా పుట్టినరోజు నాడు విడుదల చేసిన ఈ చిత్రం గ్లింప్స్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events