Skip to main content

Namaste NRI

యూకే తెలుగు బ్రాహ్మణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అష్టావధానం

యూకే తెలుగు బ్రాహ్మణ అసోసియేషన్‌ (యూకేటీబీఏ) ఆధ్వర్యంలో బర్మింగ్‌హమ్‌లో అష్టావధానం నిర్వహించారు. బాల ముకుందము పేరిట నిర్వహిస్తున్న తెలుగు పాఠశాల 8వ వార్షికోత్సవం నిర్వహించారు. ఇందులో వద్దిపర్తి పద్మాకర్‌ అష్టావధానం చేశారని నిర్వాహకులు తెలిపారు. చిన్నారులు నిర్వహించిన‌ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఎల్లాప్రగడ హేమ, నేమని రామకృష్ణ, మారుతి శ్రీనివాసశర్మ, సోమయాజుల సురేశ్‌, ప్రవీణ్‌ ఆచార్య, రామలింగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News