Skip to main content

Namaste NRI

ఆస్ట్రేలియా కీలక నిర్ణయం… రెండు సంవత్సరాల తర్వాత

ఒమైక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ప్రపంచ దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై, ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా దేశ సరిహద్దులను ఓపెన్‌ చేసింది. వ్యాక్సిన్‌ తీసుకున్న విదేశీ పౌరులను తమ దేశంలోకి అనుమతిస్తూ ప్రకటన విడుదల చేసింది. నైపుణ్యం కలిగిన విదేశీ పౌరులు, విద్యార్థులు తమ దేశంలోకి అడుగుపెట్టొచ్చని వెల్లడిరచింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ మాట్లాడుతూ వైరస్‌తో సహజీవనం చేసేందుకు సిద్ధమైనట్టు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News