Namaste NRI

రష్యాకు ఐరాసలో ఎదురుదెబ్బ

రష్యాకు ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో ఎదురు దెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌పై యుద్దానికి దిగిన రష్యాకు అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేస్తూ ఐరాస సాధారణ అసెంబ్లీ నిర్ణయం తీసుకున్నది. ఉక్రెయిన్‌లోని బుచా పట్టణంలో రష్యా బలగాలు పౌరుల ఊచకోతకు పాల్పడ్డాయన్న ఆరోపణలు వచ్చాయి. మృతదేహాలను సామూహికంగా ఖననం చేసిన దృశ్యాలు వెలుగు చూశాయి. బుచా పట్టణంలో మారణకాండ ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. దీంతో రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా దాన్ని మిత్ర దేశాలు మరిన్ని ఆంక్షలు విధించనున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events