తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియమించారు. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎల్.రమణ స్థానంలో బక్కని నర్సింహులు చంద్రబాబు నియమించారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కనికి 1994-99లో షాద్‌నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. బక్కని టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. బక్కని నర్సింహులుకు పార్టీలో మంచి పేరు ఉంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా బక్కని నర్సింహులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో నర్సింహులను అభినందించిన లోకేష్.. సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన పోరాటం చేయాలని కోరారు.