దీక్షిత్‌శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి . తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తు న్న ఈ చిత్రానికి అభిషేక్ ఎమ్ దర్శకుడు. బృందా ఆచార్య కథానాయికగా నటిస్తున్నది. శ్రీదేవి ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై హెచ్.కె.ప్రకాష్ నిర్మిస్తున్నారు. టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథాంశమిది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా అనూహ్య మలుపు లతో ఆకట్టుకుంటుంది. దీక్షిత్‌శెట్టి పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. ఈ నెల 25న టీజర్‌ను విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అభిషేక్ జే, సంగీతం: జుధాన్ శాండీ, రచన-దర్శకత్వం: అభిషేక్ ఎమ్.