Namaste NRI

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబురాలు

టి.డి.ఎఫ్ వాషింగ్టన్ డి.సి, చాఫ్టర్ వనితా టీమ్ ఆధ్వర్యంలో   బ్రాడ్ రన్ హైస్కూల్ ఆశ్ బర్న్, వర్జీనియాలో బతుకమ్మ, దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ప్రత్యేక అతిథిగా టిడిఎఫ్ యూఎస్‌ఏ అధ్యక్షుడు డాక్టర్ దివేష్ అనిరెడ్డి, టిడిఎఫ్ యూఎస్‌ఏ చైర్మన్ వెంకట్ మారం, టి.డి.ఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ మురళీ చింతలపాణి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు.

ఇండియా నుంచి ప్రఖ్యాత శిల్పి, కళాకారులు ఎంవీ రమణా రెడ్డి తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్న రూపకర్త టిడిఎఫ్ డిసి బతుకమ్మ సంబురాల్లో  పాత్ టు ఆర్టిస్టిక్ బ్రిలియన్స్, ఏ జర్నీ అన్వీల్డ్ అనే తన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ బతుకమ్మ పండుగకి ప్రత్యేక ఆకర్షణగా ఎల్లిపోతావురా మనిషి మనిషి , బాగుండాలి మనిషి అనే పాటలతో Swathi Reddy UK ఛానల్ లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని కదిలింది. స్వాతి రెడ్డి బతుకమ్మ పాటలు పాడుతూ, స్త్రీలతో కలసి ఆడుతూ అందరిలో జోష్ నింపారు.  ఇంకా ఈ పండుగ విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర వహించిన కల్పన బోయినపల్లి, శ్రీకళ, శివాని, మంజు గంగ, మంజువాణి, సూరనేని రామ్మోహన్ , జీనత్, నవీన్ చల్ల, పున్నం జొన్నల, అనిల్ కేసినేని, అమరేందర్ బొజ్జ, అశ్విని, పవన్, కరుణాకర్, రాధిక, శ్వేత ఇమ్మడి, మల్లారెడ్డి, నరేందర్, షర్మిల, వలంటీర్లకి కవిత చల్ల, వినయ సూరనేని కృతజ్ఞతలు తెలిపారు.

నవ్య ఆలపాటి తన బృందంతో తెలంగాణ పల్లె పదాల మెడ్లీ నృత్యాన్ని, మంజువాణి తన బృందంతో మహిషాసుర మర్ధిని నృత్య రూపకాన్ని ప్రదర్శించి ఆహుతులని అబ్బుర పరిచారు. విశ్వ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న తెలుగు వారందరికీ, వాషింగ్టన్ డి.సి బతుకమ్మ పండుగకు హాజరైన అందరికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ వాషింగ్టన్ డిసి వనితా టీమ్ నాయకులు కవితా చల్లా, వినయ సూరనేని కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events