Skip to main content

Namaste NRI

తెలంగాణ అసోసియేషన్‌  ఆఫ్‌ హ్యూస్టన్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ హ్యూస్టన్‌ ఆధ్వర్యంలో  అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.  సుగర్‌ల్యాండ్‌ మెర్సర్‌ మైదానంలో బతుకమ్మ వేడుకలు  నిర్వహించారు.  ఈ వేడుకల్లో  పిల్లలు, పెద్దలు అంతా కలిసి దాదాపు  5 వేల మంది సంప్రదాయబద్ధమైన వస్త్రాలు ధరించి బతుకమ్మ ఆడారు. ఆటపాటలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. టాఫ్‌ు సంస్థకు విరాళాలు అందించిన వారికి, లోగో, స్పాన్సర్లకు మీడియా మిత్రులకు సంస్థ బోర్డు సభ్యులు, ధర్మకర్తలు, సలహాదారులు, సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ టాఫ్‌ు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

Social Share Spread Message

Latest News