Namaste NRI

శ్రీరామనవమి సందర్భంగా బెల్లంకొండ కొత్త సినిమా

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా  నటిస్తున్న కొత్త సినిమాను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రకటించారు. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం.  ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తు న్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. హారర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రమిది. లైట్‌ వర్సెస్‌ డార్క్‌ కథాంశంతో సాగుతుంది. అబ్బుర పరిచే సాంకేతిక హంగులతో తెరకెక్కించబోతున్నాం. ప్రేక్షకు లకు సరికొత్త సినిమాటిక్‌ అనుభూతినందిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: చిన్మయ్‌ సలాస్కర్‌, సంగీతం: బి.అజనీష్‌ లోక్‌నాథ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: మనీషా ఏ దత్‌, నిర్మాత: సాహు గారపాటి, రచన-దర్శకత్వం: కౌశిక్‌ పెగళ్లపాటి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events